Kavitha TRS party: కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నుండి పార్టీ పేరుకు ఆమోదం లభించిన నేపథ్యంలో, సీనియర్ నాయకులు కవిత వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మద్దతు ప్రకటించగా, తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత బోడ జనార్దన్ కవితతో భేటీ అయ్యారు.
Read Also: RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Kavitha TRS party: మర్యాదపూర్వక భేటీ – త్వరలోనే అధికారిక చేరిక
శుక్రవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవితను కలిసిన బోడ జనార్దన్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలోనే తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీనియర్ నేత అయిన జనార్దన్ రాకతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బోడ జనార్దన్ కీలక పాత్ర పోషించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు హయాంలో కార్మిక శాఖ మంత్రిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఆయనకు బలమైన పట్టు ఉంది.
సింగరేణి ప్రాంతంలో పార్టీ విస్తరణే ధ్యేయం
తాను పార్టీలో చేరిన తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని జనార్దన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నాయకుడు తోడవ్వడం, కవిత ప్రారంభించిన కొత్త పార్టీకి మైలేజీని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ విస్తరణకు ఈ చేరిక దోహదపడనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

