Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ పై వేటు

కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ పై వేటు

వార్త 1 week ago

Cyberabad Constable Suspended: సామాజిక మాధ్యమాలలో TRS పార్టీ నాయకురాలు కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కే.అనిల్‌ను సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ రమేష్‌ సస్పెండ్‌ చేశారు.

శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై అధికారులు ఈ తీవ్ర చర్యలు తీసుకున్నారు.

Read Also : Papanapet Urea Shortage: యూరియా కోసం రైతుల అవస్థలు.. చెప్పులతో క్యూ

 Objectionable comments about Kavitha… Constable suspended.

Cyberabad Constable Suspended: విధులకు విరుద్ధంగా ప్రవర్తించడంతో చర్యలు

2018 బ్యాచ్‌కు చెందిన అనిల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సీఏఆర్‌ (CAR) హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా కవితను ఉద్దేశించి ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం కమిషనర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ప్రవర్తనపై సీపీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోలీస్‌ శాఖలో పనిచేసే ఉద్యోగులు క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఉపయోగించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆర్మీ రెజిమెంట్ వద్ద డిటోనేటర్లు కలకలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha