Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవితతో తమిళనాడు జ్యోతిష్యుడి భేటీ!

కవితతో తమిళనాడు జ్యోతిష్యుడి భేటీ!

వార్త 1 month ago

Kalvakuntla Kavitha: బిఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాధన్ పండిట్ ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి కోకాపేట్‌లోని కవిత నివాసంలో ఆమెను కలిశారు. ఈ సందర్భంగా కవిత తన కుమారుడితో కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read Also: TG Movie Ticket Price Hike: మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

 Tamil Nadu astrologer meets Kavitha!

Kalvakuntla Kavitha: రాజకీయ భవిష్యత్తు కోసమేనా?

చాలామంది రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు, నామినేషన్లు, పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాల కోసం ముహూర్తాలను, జ్యోతిష్యుల సలహాలను బలంగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే కవిత తన రాజకీయ భవిష్యత్తు, రాబోయే పరిణామాలపై ఆరా తీయడానికే రాధన్ పండిట్‌ను సంప్రదించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత ఆయన్ను ప్రత్యేకంగా పిలిపించారా లేక ఆయనే స్వయంగా వచ్చారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

తమిళనాడు రాజకీయాల్లో రాధన్ జోష్యాలు

జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌కు తమిళనాడు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం గురించి ఆయన ముందే ఊహించి చెప్పారని అంటుంటారు. అంతేకాకుండా, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) విజయం సాధించి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన వేసిన అంచనాలు నిజమయ్యాయి. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి వంటి కీలక నేతల జాతకాలపై ఆయన చేసిన విశ్లేషణలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి సీనియర్ జ్యోతిష్యుడు ప్రత్యేకంగా చెన్నై నుంచి వచ్చి బిఆర్‌ఎస్ నేత కవితను కలవడం, తెలంగాణ రాజకీయాల్లో ఆమె వేయబోయే తదుపరి అడుగులపై రకరకాల చర్చలకు దారితీస్తోంది.

Epaper: epaper.vaartha.com

ఉద్యోగుల సమస్యలపై బీజేపీ అండగా ఉంటుంది: బండి సంజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha