Konda Surekha: ఇంటర్వ్యూ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంచివారని కొనియాడారు. ఆయన ఎప్పుడూ తమను ఒక్క మాట కూడా అనలేదని, ఎప్పుడు కలిసినా ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా రిసీవ్ చేసుకునేవారని తెలిపారు.
కేసీఆర్‌లో గొప్ప హుందాతనం ఉంటుందని, ఆయన ఎప్పుడూ తమకు సముచిత గౌరవం ఇచ్చేవారని సురేఖ గుర్తు చేసుకున్నారు.

కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైనం
తాము అడగగానే తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచిత గౌరవం కల్పించారని కొండా సురేఖ వెల్లడించారు. గతంలో వారు గులాబీ పార్టీలో కొనసాగిన కాలంలోని మధుర జ్ఞాపకాలను, కేసీఆర్‌తో ఉన్న సత్సంబంధాలను ఆమె ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.
Konda Surekha: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రయాణం
రాజకీయ ప్రయాణాన్ని వివరిస్తూ, కొండా సురేఖ 2013లో గులాబీ (బీఆర్ఎస్) పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత కాలంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల వేళ కేసీఆర్‌పై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏంటి?.. 'ప్లాన్ బీ'పై ఆసక్తికర చర్చ

