Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేబినెట్ హోదాపై స్పందించిన నాగబాబు

కేబినెట్ హోదాపై స్పందించిన నాగబాబు

వార్త 1 month ago

Nagababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ పదవి దక్కడంపై జనసేన పార్టీ నాయకుడు నాగబాబు తొలిసారిగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తనను ఈ కీలక పదవికి ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రొటోకాల్‌ను మించి గురుతర బాధ్యతగా..

ఈ నియామకాన్ని కేవలం ఒక హోదా లేదా ప్రొటోకాల్‌గా చూడబోనని నాగబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తనపై ఉంచిన గురుతర బాధ్యతగా దీన్ని భావిస్తున్నట్లు వెల్లడించారు. మొక్కలు నాటడం అనేది తన దైనందిన జీవనశైలిలో ఎప్పటి నుంచో ఉన్న ఒక భాగమని ఆయన గుర్తుచేశారు.

Nagababu: పచ్చదనం, ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం

ఈ కొత్త బాధ్యత ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చని వాతావరణంతో, ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తానని నాగబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha