Hyderabad Crime: హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద ఒక తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నల్లగండ్ల ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also : Raichur Family Tragedy: రాయచూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. అసలేం జరిగింది?
Young man dies by suicide after jumping from cable bridge; were financial troubles the reason?
Hyderabad Crime: సాయి మహేశ్వర్‌గా గుర్తించిన పోలీసులు
మృతుడిని నల్లగండ్లలోని మీరో అపార్ట్‌మెంట్స్‌లో నివసించే 29 ఏళ్ల సాయి మహేశ్వర్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం సమయంలో అతను కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకేశాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు, డీఆర్ఎఫ్ (DRF) సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర శ్రమ అనంతరం సాయి మహేశ్వర్ మృతదేహాన్ని నీటిలో నుండి వెలికితీశారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సాయి మహేశ్వర్ గతంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం ఒక మొబైల్ షాపు నడిపాడు. అయితే ప్రస్తుతం అతను ఎలాంటి ఉద్యోగం లేదా వ్యాపారం లేకుండా ఖాళీగా ఉంటున్నట్లు తేలింది. కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కుమారుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశారు.

