Dailyhunt
కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి, సిద్దిపేట ఆధ్వర్యంలో యాత్రికులకు విశేష సేవలు

కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి, సిద్దిపేట ఆధ్వర్యంలో యాత్రికులకు విశేష సేవలు

వార్త 1 week ago

యాత్రికుల సేవలో మొదటి విడతలో అధ్యక్షులు చీకోటి మధుసూదన్

ఉపాధ్యక్షులు కాచం కాశినాథ్

సిద్దిపేట: హిమాలయ పర్వతాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరుగాంచిన కేదార్‌నాథ్లో యాత్రికులకు సేవలందించేందుకు సిద్దిపేటకు చెందిన కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది.సమితి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్ ప్రయాగ్ పార్కింగ్ సముదాయం వద్ద, కేదార్‌నాథ్ ఆలయం సమీపంలోని ప్రవచన హాల్ వద్ద రెండు కేంద్రాల్లో అన్నప్రసాద సేవలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి ఈ సేవలు ఈ నెల 22వ తేదీన ప్రారంభమయ్యాయి.

Read Also:BRS Formation Day: బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ధీమా.. మళ్లీ బీఆర్ఎస్‌ను పట్టాలెక్కిస్తాం

ఈ కార్యక్రమంలో భాగంగా సమితి అధ్యక్షులు శ్రీ చీకోటి మధుసూదన్, ఉపాధ్యక్షులు శ్రీ కాచం కాశినాథ్ గార్లు 12 మంది వంట సిబ్బందితో కలిసి మొదటి విడతగా 15 రోజుల పాటు అక్కడి స్థానిక సేవకులు మరియు పెయిడ్ వర్కర్స్ దాదాపు 50 మంది తో యాత్రికులకు సేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం యాత్రికుల రద్దీ ఎక్కువ గా ఉండటం వల్ల రాత్రి 2 గంటల వరకు కూడా అన్నప్రసాద సేవలు అందిస్తున్నారు.

Siddipet: సమితి ప్రతినిధులు మాట్లాడుతూ,

ఉదయం 5 గంటలకు టీతో ప్రారంభమై, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ & స్నాక్స్, రాత్రి భోజనం వరకు నిరంతరం రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద సేవలు అందిస్తున్నామని తెలిపారు. అదనంగా, యాత్రికులకు అవసరమైన సహాయక సేవలు కూడా సమితి ద్వారా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

సంప్రదించవలసిన వారు

అధ్యక్షులు
చీకోటి మధుసూదన్ - 9949930005

ప్రధాన కార్యదర్శి
అయిత రత్నాకర్ - 9246932267

ఉపాధ్యక్షులు
కాచం కాశినాథ్ - 9848423408

కోశాధికారి
గోపిశెట్టి శరబయ్య - 9848124031

పబ్లిక్ రిలేషన్
డా. మాంకాల నవీన్ కుమార్ - 9440777741

యాత్రికుల అనుభూతి సందేశం

"హిమాలయాల పవిత్ర వాతావరణంలో కేదారేశ్వరుని దర్శనం ఒక దైవానుభూతి అయితే, సిద్దిపేట v అన్నదాన సేవా సమితి అందించిన అన్నప్రసాదం మా యాత్రను మరింత పవిత్రంగా, సార్థకంగా మార్చింది.ఉష్ణమైన టీతో మొదలై, రుచికరమైన భోజనంతో ముగిసే ఈ సేవ మా శరీరానికి మాత్రమే కాదు, మనసుకూ ఆత్మకూ అపారమైన తృప్తిని ఇచ్చింది.

ఇంత దూరంలో, ఇంత ప్రేమతో, ఇంత సేవాభావంతో అన్నప్రసాదం అందించిన సమితి సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సేవ నిజంగా దైవ సేవే అనిపించింది.ఇలాంటి మహోన్నత సేవలు కొనసాగాలని, మరెందరో యాత్రికులకు ఉపశమనం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము."యాత్రికులు ఈ సేవలను వినియోగించుకోవాలని సమితి విజ్ఞప్తి చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మహీంద్రా షోరూమ్‌లో చెలరేగిన మంటలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha