Dailyhunt
Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన 'రివాల్వర్ రీటా'

Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన 'రివాల్వర్ రీటా'

వార్త 3 months ago

కవైపు థియేటర్‌లలో చిన్న సినిమాలు అలరిస్తుంటే.. ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సినిమా కూడా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.

(Keerthy Suresh) ఈ క్రైమ్ కామిడి సినిమా పేరు 'రివాల్వర్ రీటా'. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమా గత నెల థియేటర్స్ లో విడుదల అయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కీర్తి సురేశ్ లేటెస్ట్ మూవీ

ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. తమిళ .. తెలుగు భాషలతో పాటు, ఇతర భాషలలోను ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను పలకరించింది. (Keerthy Suresh) ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వారు సొంతం చేసుకున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రాధిక .. సునీల్ .. అజయ్ ఘోష్ కీలకమైన పాత్రలను పోషించారు.

ఈ కథ విషయానికి వస్తే, పాండ్యన్ తిరుగులేని నాయకుడిగా నేరసామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. తన సోదరుడిని హాత్య చేసిన పాండ్యన్ ను అంతం చేయాలనే ప్రతీకారంతో నర్సింహా రెడ్డి ఉంటాడు. అందుకోసం మార్టిన్ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. అయితే ఈ లోగానే రీటా తల్లి కారణంగా పాండ్యన్ మరణిస్తాడు. ఫలితంగా రీటా ఆమె తల్లి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Champion Movie: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'ఛాంపియన్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha