SRH vs KKR Match Score: ఐపీఎల్ 2026 సీజన్ 6వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విశ్వరూపం చూపించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన పోరులో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 65 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
హైదరాబాద్ పరుగుల సునామీ
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా.. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (39) మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ బౌలర్లలో ముజారబానీ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
SRH team celebrating victory against KKR in IPL 2026 at Eden Gardens
SRH vs KKR Match Score: కుప్పకూలిన కోల్‌కతా బ్యాటింగ్
227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. హైదరాబాద్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (28) వేగంగా ఆడినా, రఘువంశీ (52) అర్ధ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. రింకూ సింగ్ (35) కాసేపు అలరించాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో కేకేఆర్ నడుము విరవగా.. నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ చెరో రెండు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్ష్ దుబే ఒక వికెట్ సాధించాడు. ఈ విజయంతో హైదరాబాద్ ఈ సీజన్‌లో తన మొదటి గెలుపును నమోదు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

