Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేమికల్ ఫ్యాక్టరీలో ఘోరం: గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం!

కేమికల్ ఫ్యాక్టరీలో ఘోరం: గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం!

వార్త 1 day ago

Yadgir Chemical Factory Accident: కర్ణాటకలోని ఓ రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాద్గిర్ జిల్లా కడేచూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఒక కేమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తూ రసాయన వాయువు (Toxic Chemical Gas) లీక్ కావడంతో ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Read Also :CRPF ASI Kills 2 Colleagues : అస్సాంలో సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ కాల్పుల కలకలం: ఇద్దరు జవాన్లు బలి, మరొకరికి తీవ్ర గాయాలు

Yadgir Chemical Factory Accident: ఘటన వివరాలు

ఈ విషవాయువు లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన ‘గణేష్’ కూడా ఉన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన మిగతా ముగ్గురు తీవ్ర అవస్థలు పడటంతో వారికి ఐసియు (ICU) లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫరీదాబాద్‌లో కత్తిపోట్లతో టీచర్ హత్య.. నిందితుడు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha