Gurpatwant Singh Pannun Life Threat : తన ప్రాణానికి మళ్లీ ముప్పు పొంచి ఉందని, అమెరికాకు చెందిన FBI, కెనడాకు చెందిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) అధికారులు ఇటీవల హెచ్చరించారని సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వెల్లడించారు.
ముప్పు తొలగిపోయే వరకు ప్రయాణాలు చేయవద్దని, తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే ఆ వివరాలను ముందుగానే తెలియజేయాలని ఎఫ్‌బీఐ ఏజెంట్లు పన్నూకు సూచించారు. 2023లో పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడైన భారతీయుడు నిఖిల్ గుప్తాపై అమెరికా మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో 2026 నవంబర్ 20న నిఖిల్ గుప్తాకు శిక్ష ఖరారు కానుంది. బెదిరింపులకు భయపడేది లేదని, బుల్లెట్ ఎదురైనా తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. అమెరికా, కెనడా ప్రభుత్వాలు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఈ విషయంలో నిలదీయాలని కోరారు.
Read Also: Islamabad Hospital Fire: ఇస్లామాబాద్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి
Gurpatwant Singh Pannun Life Threat
Gurpatwant Singh Pannun Life Threat : కేసు నేపథ్యం మరియు వివరాలు
2023లో అమెరికా గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, దాన్ని భగ్నం చేశామని అమెరికా అధికారులు ప్రకటించారు. ఈ కుట్ర వెనుక ఒక భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉందంటూ అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారంలో నిఖిల్ గుప్తా అనే వ్యక్తికి కిరాయి హత్య బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలపై అతడిని చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేసి, అనంతరం అమెరికాకు అప్పగించారు. 2026 ఫిబ్రవరిలో మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టులో నిఖిల్ గుప్తా తనపై ఉన్న కుట్ర, మనీలాండరింగ్ అభియోగాలను అంగీకరించారు. దీనికి సంబంధించి ఆయనకు 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, అమెరికా చేసిన ఈ కుట్ర ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది మరియు దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com

