Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. నవంబర్ 2వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యటించి పలు రాజకీయ, ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఈ మేరకు హోం మంత్రి పర్యటనకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్ విడుదలైంది.
Signathon Awareness Run: సైనాథాన్ 3.0.. ఆశ్రయ్ ఆకృతి ఆధ్వర్యంలో 2,500 మందితో భారీ అవగాహన రన్
షెడ్యూల్ ఇదే
మధ్యాహ్నం 2:00 గంటలకు: ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
మధ్యాహ్నం 2:15 నుండి 4:00 వరకు: బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ కాకతీయకు చేరుకుని అక్కడ బస చేస్తారు.
సాయంత్రం 4:00 గంటలకు: నిజాం కాలేజ్ సమీపంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ప్రసిద్ధ ఎంజే మార్కెట్ (మోజంజాహి మార్కెట్) వరకు నిర్వహించే భారీ ర్యాలీ/పాదయాత్రలో పాల్గొంటారు.
సాయంత్రం 5:00 నుండి 5:30 వరకు: ఎంజే మార్కెట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ (వీధి బహిరంగ సభ)కు హాజరై ప్రసంగిస్తారు.
సాయంత్రం 6:00 గంటలకు: కార్యక్రమం ముగిసిన అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

రాజకీయ ప్రాధాన్యత, కీలక భేటీలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్న రిజర్వ్ సమయంలో రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య ప్రముఖులతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
కేంద్ర హోం మంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు బేగంపేట, నిజాం కాలేజ్, ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

