Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

వార్త 2 months ago

Central Cabinet: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది.

ముఖ్యంగా రైల్వే, రోడ్డు రవాణా, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రకటించిన నిర్ణయాలతో ఏపీకి విశేష లబ్ధి చేకూరనుంది.

Read Also: India-Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీగా డీజిల్ సరఫరా చేస్తున్న భారత్

 Key decisions of the Central Cabinet

రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు

రాజమండ్రి (నిడదవోలు), విశాఖపట్నం (దువ్వాడ) మధ్య అత్యంత రద్దీగా ఉండే మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. సుమారు 198 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం భారీ నిధులను కేటాయించింది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా, సరుకు రవాణా వేగం పెరిగి వాణిజ్య పరంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాగే, గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించనున్న భారీ వంతెన ఈ ప్రాంత రవాణా ముఖచిత్రాన్ని మార్చనుంది.

ఓడరేవుల కనెక్టివిటీకి పెద్దపీట

రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన కాకినాడ, మచిలీపట్నం మరియు గంగవరం పోర్టులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేసింది. దీనికోసం రూ. 9,889 కోట్ల భారీ వ్యయంతో 198 కిలోమీటర్ల మేర ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే పోర్టుల నుంచి సరుకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, పారిశ్రామిక హబ్‌లకు కొత్త ఊపిరి అందనుంది.

ఉద్యోగులకు ‘డీఏ’ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనివ్వనుంది. దీంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి దోహదపడే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను మరో మూడేళ్ల పాటు పొడిగించారు. దేశ మారిటైమ్ రంగానికి భరోసా ఇచ్చేలా రూ. 12,980 కోట్ల కేటాయింపుతో ‘భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్’ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha