Telangana Central Funds: కేంద్ర నిధులపై రాష్ట్ర సర్కార్ పెట్టుకున్న భారీ అంచనాలు తప్పు కున్నాయి. అడిగిన నిధుల్లో పెద్ద మొత్తంలో కోత ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లుతోంది.
కేoద్రం నుంచి రావాల్సిన నిధులు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్వంత ఆదాయం పైనే ఎక్కువగా ఆధారపడక తప్పడం లేదు. ఖర్చులకు తగిన ఆదాయం రాకపోవడంతో అప్పులపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2026 మార్చి 31 వరకు ఈ మూడేళ్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 85,677.82 కోట్లు కేంద్రాన్ని అడిగింది.
మూడేళ్లలో రూ. 57 వేల కోట్ల గ్యాప్!
అయితే కేంద్రం మాత్రం ఇచ్చింది రూ.28,065.97 కోట్లు మాత్రమేననేది ఆర్థిక శాఖ లెక్కలు వెల్లడి. స్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.41,259.17 కోట్ల మేర నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ఆ ఏడాది ఇందులో కేవలం 23.58 శాతం మేర 9,729.91 కోట్లను విడుదల చేసింది. అలాగే 2024-25లో రూ.21,636.15 కోట్లకు అంచనాలు సమర్పిం చగా, ఇందులో 36.57 శాతం చొప్పున రూ.7,913.08 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన 2025-26 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర నిధులు రూ.22,782.50 కోట్ల అంచనాలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, ఇందులో 45.75 శాతం మేర రూ.10.422.98 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. కాగా రాష్ట్ర ఆదాయాలు, ఖర్చుల మధ్య లోటు భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమ పథకాల అమ లుకు లోటును పూడ్చటానికి వీటిని ఉద్దేశిస్తుంది.
అలాగే ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్లు కూడా ఇస్తుంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలైన జల్ జీవన్ మిషన్, పీఎం ఏవై, ఎన్హెచ్ఎం, విద్యా పథకాలకు సహాయం చేస్తుంది. వరదలు, కరువు, తుఫాన్లు, భూ కంపాల వటి సందర్భాల్లోనూ ప్రత్యేక గ్రాంట్లు ఇస్తుంది. ఆదివాసీ ప్రాంతాల వృద్ధి, రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, ఆర్థికంగా బలహీన రాష్ట్రాల కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం గ్రాంట్స్ ఇస్తారు. ముఖ్యంగా ఇలా ఇచ్చే గ్రాంట్లు ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు, కేంద్రం ప్రకటించే ప్రాయోజిత పథకాలు, వాటికోసం రాష్ట్రానికి చేసిన కేటాయింపుల మేరకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి వచ్చే ఆదాయాన్ని అంచనావేసి బడ్జెట్లో పొందుపరుస్తారు.
Telangana Secretariat building representing the state finance department and budget planning sessionsTelangana Central Funds: నిధుల రాకకు కారణాలు
అయితే ఆర్థిక సంఘం సిఫారసులు కూడా పట్టించుకోని కేంద్రం చిన్నచిన్న కారణాలు చూపి రాష్ట్రానికి గ్రాంట్స్ విడుదల చేయడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఆర్థిక సంఘం సి ఫారసులతో పాటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, విపత్తుల నిర్వహణ నిధి, పట్టణాభివృద్ధికి గ్రాంట్స్ రావాలి. కానీ యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమ యానికి ఇవ్వడం లేదన్న కారణం చూపి నిధులు విడుదల చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అయినా దానిపై స్పందన మాత్రం కరువయింది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు లోటును పూడ్చుకోవడానికి అప్పులు. చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

