Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

వార్త 1 week ago

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

అమెరికా (US) ప్రభుత్వం ఏపీ ఆక్వా ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం అదనపు సుంకాన్ని (టారిఫ్) విధించడంతో ఇక్కడి ఎగుమతులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు ఆక్వా రైతులు, ఎగుమతిదారుల కష్టాలను వివరించారు. అమెరికా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఆక్వా రంగానికి వాటిల్లుతున్న నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.

Read Also ; జూన్ 12 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ!

 CM Chandrababu

30 లక్షల మంది ఉపాధికి ముప్పు!

ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు భారీ ఎత్తున రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. అయితే, తాజా సుంకాల పెంపుతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఏపీ ఆక్వా ఉత్పత్తుల ధరలు పెరిగి, డిమాండ్ దారుణంగా పడిపోయింది. దీనివల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 30 లక్షల మందికి పైగా కార్మికులు, రైతులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా పరిశ్రమ కుప్పకూలిపోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి అమెరికా ప్రభుత్వంతో ఉన్నత స్థాయి దౌత్యపరమైన చర్చలు జరపాలని, ఈ అదనపు సుంకాలను తగ్గించేలా ఒత్తిడి తీసుకురావాలని సీఎం చంద్రబాబు లేఖలో గట్టిగా విజ్ఞప్తి చేశారు.

ప్యాకేజీ ప్రకటించాలి.. సీఎం చంద్రబాబు డిమాండ్లు

రాష్ట్రంలోని ఆక్వా రంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అమలు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అందులో భాగంగా ప్రధానంగా ఈ క్రింది ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు:

వర్కింగ్ క్యాపిటల్ పెంపు: ఆక్వా పరిశ్రమల నిర్వహణ మూలధన (Working Capital) పరిమితులను తక్షణమే 30 శాతానికి పెంచాలి.

వడ్డీ మారటోరియం: ఎగుమతిదారులు చెల్లించాల్సిన బ్యాంక్ వడ్డీలపై కనీసం 240 రోజుల పాటు మారటోరియం విధించాలి.

రాయితీలు & జీఎస్టీ మినహాయింపు: వడ్డీ రేట్లను 5 శాతానికి పరిమితం చేయడంతో పాటు, ఆక్వా ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీ (GST) నుండి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాలి.

ఈ చర్యలు తీసుకుంటేనే ప్రస్తుత సంక్షోభం నుండి ఆక్వా రంగం గట్టెక్కగలదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బాబు ప్రకటనపై రేణుకా చౌదరి అభ్యంతరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha