Bhatti Vikramarka : తెలంగాణలో ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల తలెత్తిన తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రాష్ట్ర శాసనసభ కోరింది.
ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ. 20,000 కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీని (Bhatti Vikramarka) ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
కరువు నివారణ చర్యలపై :
శాసనసభలో ఎల్‌నినో ప్రభావం, కరువు నివారణ చర్యలపై జరిగిన స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణం కంటే గణనీయంగా లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీటి అవసరాలు, చెరువుల పునరుద్ధరణ మరియు కరువు నివారణ చర్యల నిమిత్తం కేంద్రం తక్షణమే రూ. 20 వేల కోట్లు విడుదల చేయాలని తీర్మానంలో స్పష్టం చేశారు.
Bhatti Vikramarkaఅలాగే, రాష్ట్రంలో కరువు తీవ్రతను పరిశీలించేందుకు వెంటనే ఒక కేంద్ర బృందాన్ని పంపాలని, జాతీయ విపత్తు నిధి (NDRF) నుంచి తగిన సాయం అందించాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను మరో 50 రోజులు పెంచి, ఆ పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అదనంగా 1,500 మెగావాట్ల విద్యాయుత్తును కేటాయించాలని తీర్మానంలో కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ముందస్తు చర్యలు, కేంద్రానికి పంపిన విజ్ఞప్తులు రాష్ట్రంలోని రైతాంగానికి, ప్రజలకు ఎంతవరకు ఊరటనిస్తాయో వేచి చూడాలి.

