Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్‌లో ఈమెయిల్ మార్పు ఇక ఉచితం!

కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్‌లో ఈమెయిల్ మార్పు ఇక ఉచితం!

వార్త 4 days ago

Aadhar card update:భారతదేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌లో ఈమెయిల్ ఐడిని ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయం కల్పించింది. సాధారణంగా ఈ మార్పుల కోసం రూ.75 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు ఆరు నెలల పాటు ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశారు. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు మీరు ఎటువంటి డబ్బు చెల్లించకుండానే ఈ సేవను పొందవచ్చు. మీ ఆధార్‌ను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసుకోవడానికి ఇది మంచి సమయం.

Read also: UP TET admit card 2026: యూపీ టెట్ అడ్మిట్ కార్డ్ విడుదల..నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి!

 Opportunity to update email for free

యాప్ ద్వారానే ఈ సౌకర్యం లభ్యం

ఈ ఉచిత సదుపాయం కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. మీరు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఈ మినహాయింపు వర్తించదు. కాబట్టి మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కేంద్రాల్లో అయితే తప్పనిసరిగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇంట్లోనే ఉండి సులభంగా అప్‌డేట్ ప్రక్రియ పూర్తి చేసుకోండి.

Aadhar card update:ప్రక్రియను పూర్తి చేసే విధానం

మొబైల్ యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ సెక్షన్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ మీ కొత్త ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ ఈమెయిల్ ఆధార్‌కు అనుసంధానం అవుతుంది. డెడ్ లైన్ ముగిసే లోపు ఈ ఉచిత సేవను అందరూ వినియోగించుకోండి.

Epaper: epaper.vaartha.com

యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవల్లో మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha