Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేన్స్ 2026లో ఐశ్వర్య రాయ్‌పై బాడీ షేమింగ్.. ట్రోలర్స్‌కు కంగనా కౌంటర్!

కేన్స్ 2026లో ఐశ్వర్య రాయ్‌పై బాడీ షేమింగ్.. ట్రోలర్స్‌కు కంగనా కౌంటర్!

వార్త 3 weeks ago

Kangana Ranaut: ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదిక 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026' లో గత రెండు దశాబ్దాలుగా భారతీయ సౌందర్యాన్ని, హుందాతనాన్ని చాటుతూ వస్తున్నారు విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్.

ఈ ఏడాది కూడా ఆమె తన 24వ కేన్స్ ప్రయాణాన్ని ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. అయితే, దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా వర్గం ఆమె ఫ్యాషన్ ప్రయోగాలను అభినందించాల్సింది పోయి.. ఆమె శరీరాకృతిపై, పెరిగిన బరువు, వయసుపై బాడీ షేమింగ్ చేయడం ప్రారంభించింది.

మహిళల పట్ల సమాజంలో ఉన్న ఈ సంకుచిత మనస్తత్వంపై, ముఖ్యంగా వయసు పైబడుతున్న స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేసే ధోరణిపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్యకు మద్దతుగా నిలుస్తూ ట్రోలర్స్‌కు ఆమె ఇచ్చిన ఘాటైన కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also : Hallallallo Full Video Song: ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మాస్ డ్యాన్స్‌తో యూట్యూబ్ షేక్!

 Body shaming of Aishwarya Rai at Cannes 2026.. Kangana counters trollers!

Kangana Ranaut: ఆమె ఎవరికీ ఏమీ బాకీ లేదు.. కంగనా

సమాజంలో మహిళలపై, వారి లుక్స్ పై ఉండే అంచనాలను కంగనా రనౌత్ పూర్తిగా తప్పుబట్టారు. ఐశ్వర్యా రాయ్ కేన్స్ రెడ్ కార్పెట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఒక మహిళ ఆత్మగౌరవాన్ని తట్టిలేపేలా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

“ఫ్యాషన్, స్టైల్ అనేవి ఒకరి స్వీయ వ్యక్తీకరణ. ఇది జీవితం పట్ల, వారి వైఖరి పట్ల వారికీ ఉండే వ్యక్తిగత అవగాహన. సమాజంలో ఏ మహిళా ఎవరికీ ఏమీ బాకీ లేదు. ఐశ్వర్య ఈ లుక్‌లో చాలా అద్భుతంగా, మహారాణిలా కనిపిస్తోంది. ఆమెను వేరే విధంగా చూడాలనుకునే వారు, మొదట మీరేంటో సమాజంలో నిరూపించుకోండి. ఆమె ఇక్కడ మిమ్మల్ని మెప్పించడానికి లేదు.. ఆమె ఎప్పటికీ వైభవంగానే ఉంటుంది” అని కంగనా కొనియాడారు.

యువ నటీమణులతో పోల్చడంపై ఆగ్రహం

రెడ్ కార్పెట్ ఈవెంట్లలో వయసు పైబడిన మహిళల శరీరాకృతిని, లుక్స్‌ను అలియా భట్ వంటి యువ నటీమణులతో పోల్చుతూ కొందరు నెగిటివ్ కామెంట్లు చేయడంపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వయసు మహిళలను అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌లపై హుందాతనంతో చూడటం సమాజానికి అలవాటు లేకపోతే.. ఇప్పటికైనా ఆ అపోహల నుండి బయటపడి అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఇంటర్నెట్ ట్రెండ్స్ వెనుక పరిగెత్తడం కంటే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న ఐశ్వర్య స్థానం ఎప్పటికీ మారదని గుర్తుచేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha