Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శీతల్ (32) అనే వివాహిత తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కుటుంబ నేపథ్యం మరియు ఘటన జరిగిన తీరు
కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-6లోని పంచవటి అపార్ట్‌మెంట్స్‌లో శీతల్ తన భర్త పురుషోత్తమన్, అత్తమామలతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కేరళ కన్నూరుకు చెందిన శీతల్‌కు ఆరేళ్ల క్రితం వివాహం కాగా, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సోమవారం సాయంత్రం టెర్రస్ పైకి వెళ్లే మెట్లపై కాసేపు కూర్చున్న ఆమె, ఒక్కసారిగా పైకి వెళ్లి కిందకు దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad: డిప్రెషనే కారణమా? దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శీతల్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, అందుకు మందులు కూడా వాడుతున్నారని ఆమె భర్త, కేరళలో ఉన్న సోదరుడు తెలిపినట్లు ఎస్సై శశిధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి, అన్ని కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం బీజేపీ నేత రాంచందర్ రావు దీక్ష

