Aurangabad Day Care Center: చిన్నారుల భద్రతకు నిలయంగా ఉండాల్సిన ఓ డే కేర్ సెంటర్ (Day Care Centre) ఘోర నిర్లక్ష్యం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) లో కేవలం 23 నెలల (రెండేళ్లు కూడా నిండని) ఓ అమాయక చిన్నారిపై మరో బాలుడు ఏకంగా 25 సార్లు కొరుకుతూ పైశాచికంగా దాడి చేసిన ఉదంతం కలకలం రేపుతోంది. గదిలో సిబ్బంది ఎవరూ లేకపోవడం, ఆఫీస్ నిర్వాహకులు ఈ ఘోరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం అక్కడి సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డవడంతో ఈ దారుణం బట్టబయలైంది.
Read Also:Panvel Anganwadi incident: దారుణం.. నిస్సహాయ చిన్నారిపై అంగన్‌వాడీ టీచర్ దాష్టీకం
గదిలో వదిలేసి వెళ్లారు.. 15 నిమిషాల నరకం
జూన్ 22న సిడ్కో (CIDCO) ప్రాంతంలోని ప్రముఖ 'ఫస్ట్‌క్రై ఇంటెల్లిటాట్స్ ప్రీ స్కూల్ & డే కేర్' (FirstCry Intellitots Pre-School) లో ఈ అమానుషం చోటుచేసుకుంది.
- సిబ్బంది నిర్లక్ష్యం: ఓ మహిళా న్యాయవాది ఉదయం 10:30 గంటలకు తన 23 నెలల కుమారుడిని డే కేర్‌లో వదిలి వెళ్లారు. అయితే, అక్కడి కేర్‌టేకర్ ఒక చిన్నారిని తీసుకుని బయటకు వెళ్తూ.. మిగిలిన ముగ్గురు చిన్నారులను ఏ ఒక్కరి పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా గదిలోనే వదిలేసింది.
- భయంతో ఏడుపు.. విచక్షణారహిత దాడి: గదిలో ఎవరూ లేకపోవడంతో పిల్లలు భయంతో ఏడవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ బాలుడు ఉన్మాదిలా ప్రవర్తిస్తూ బాధిత చిన్నారిపై దాడికి తెగబడ్డాడు. ముఖం, ముక్కు, పెదవులు, ఛాతీ, వీపు, కాళ్లపై ఏకంగా 25 సార్లు పంటితో కొరికాడు.
- 15 నిమిషాల పాటు ఒంటరిగా: దాదాపు 15 నిమిషాల పాటు ఆ చిన్నారి రక్తం వచ్చేలా విలవిల్లాడుతూ ఏడుస్తున్నా, పక్కనే మరో చిన్నారి భయంతో వణికిపోతున్నా.. ఏ ఒక్క సిబ్బంది కూడా గదిలోకి వచ్చి చూడకపోవడం డే కేర్ యాజమాన్య పరాకాష్టకు అద్దం పడుతోంది.
₹10 లక్షల ఆఫర్.. దాచిపెట్టే ప్రయత్నం
మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టిన యాజమాన్యం.. తీరా తల్లిదండ్రులు వచ్చేసరికి 'చిన్న గీతలే పడ్డాయి' అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ, బాలుడి దుస్తులు విప్పి చూడగానే ఒళ్లంతా రక్తం గడ్డకట్టిన పంటి గాట్లు కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
కేసు పెట్టొద్దంటూ భారీ ఆఫర్.. పోలీసుల ఎంట్రీ
ఈ దారుణం బయటపడకుండా ఉండేందుకు డే కేర్ యాజమాన్యం బాధితులకు రూ. 10 లక్షల నగదుతో పాటు, మూడేళ్ల పాటు ఉచిత విద్య అందిస్తామని 'సెటిల్‌మెంట్ ఆఫర్' ఇచ్చినట్లు బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే దీనికి లొంగని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో డే కేర్ సీఈవో (CEO) శుభమ్ మహేశ్వరి, మేనేజర్లు మంగేశ్ ముసాలే, వైభవ్ సావడే, ప్రిన్సిపాల్ కాంచన్ యేవాలే, కేర్‌టేకర్ సహా ఆరుగురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
Aurangabad Day Care Center: సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర విస్మయం
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత చిన్న వయసులోనే ఆ పిల్లాడికి అంత హింసాత్మక ప్రవర్తన ఎలా సాధ్యమని, ఆ బాలుడు ఏదైనా తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. వెంటనే ఆ బాబు తల్లిదండ్రులు చైల్డ్ సైకాలజిస్ట్‌కు చూపించి కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

