Kerala Politics : కేరళ రాజకీయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేపట్టారు.
ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వీణ కంపెనీ లావాదేవీలపై విచారణ
మాజీ సీఎం కుమార్తె టి. వీణకు చెందిన సంస్థకు సీఎంఆర్‌ఎల్ నుంచి ఎలాంటి సేవలు లేకుండానే భారీ మొత్తంలో నిధులు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ జరపగా, ఇప్పుడు ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసింది. తిరువనంతపురంలోని విజయన్ నివాసంతో పాటు పలువురు సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
Read Also ; రేపు ప్రధాని మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి భేటీ
Kerala Politicsసీపీఎం కార్యకర్తల ఆగ్రహం
ఈడీ సోదాల విషయం బయటకు రావడంతో సీపీఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో విజయన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కేంద్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, కొన్ని ప్రాంతాల్లో వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

