Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళలో హ్యాపీ రీ-రిలీజ్.. కొత్త సినిమా రేంజ్‌లో రికార్డు కలెక్షన్లు

కేరళలో హ్యాపీ రీ-రిలీజ్.. కొత్త సినిమా రేంజ్‌లో రికార్డు కలెక్షన్లు

వార్త 2 weeks ago

Happy Movie Re Release: సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు గడిచినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేరళ ప్రేక్షకుల అభిమానం ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది.

రీసెంట్‌గా 4K హంగులతో మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో.. కేరళలోనూ అంతే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ బన్నీని అభిమానులు ముద్దుగా 'మల్లు అర్జున్' అని పిలుచుకుంటారు. జూన్ 11న మలయాళంలో 'హ్యాపీ బీ హ్యాపీ' పేరుతో రిలీజైన ఈ రీ-రిలీజ్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Read also: Samantha: 'మా ఇంటి బంగారం' ప్రమోషన్స్‌లో సమంత సరికొత్త రికార్డు.. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు!

Happy Movie Re Release: సరికొత్త సినిమా రేంజ్‌లో రికార్డు కలెక్షన్లు

కేరళలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఒక కొత్త సినిమా విడుదలైన రేంజ్‌లో ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రం మొదటి రోజే 30 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసి.. కేవలం మూడు రోజుల్లోనే కోటి రూపాయల మార్కును దాటేసింది. 2026లో కేరళలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాలీవుడ్ రీ-రిలీజ్ చిత్రంగా 'హ్యాపీ' నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు లిమిటెడ్ షోలు వేస్తారు, కానీ బన్నీ క్రేజ్ చూసి అక్కడ థియేటర్ల కౌంట్‌ను 120 స్క్రీన్స్‌కు పెంచడం విశేషం.

థియేటర్‌లో చిందేసిన 'విత్ లవ్' బ్యూటీ అనస్వర రాజన్

అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్, ముఖ్యంగా 'వస్సా రే వస్సా రే' సాంగ్ వస్తున్నప్పుడు థియేటర్లు స్టేడియంలను తలపించాయి. ఈ క్రమంలోనే మలయాళ క్రేజీ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ తన సోదరి ఐశ్వర్య, స్నేహితులతో కలిసి థియేటర్‌లో తెగ హంగామా చేశారు. బన్నీ పాటలకు స్క్రీన్ ముందు మాస్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల ‘విత్ లవ్’, ‘రేఖచిత్రం’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అనస్వర రాజన్.. తాను చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అని, అందుకే థియేటర్‌లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానని వెల్లడించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. 'టీవీకే' పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha