Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళం కొత్త సీఎం కన్నీరు

కేరళం కొత్త సీఎం కన్నీరు

వార్త 1 week ago

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన వీడీ సతీశన్ మర్యాదపూర్వక పర్యటనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తనను రాజకీయంగా వెన్నంటి నడిపించిన దివంగత కాంగ్రెస్ నేత జి. కార్తికేయన్ ఇంటికి వెళ్లారు. అక్కడ కార్తికేయన్ చిత్రపటానికి నివాళులర్పిస్తుండగా సతీశన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నేడు ఈ విజయాన్ని చూడలేకపోయారన్న ఆవేదనతో ఆయన కళ్లు చెమర్చాయి.

Read Also : ఇంధన సంక్షోభం: ప్రపంచం వణికిపోతున్నా భారత్ ధీమాగా ఉండటానికి కారణం ఇదే!

'సీఎం ఇలా ఏడవకూడదు'.. ఓదార్పు

సతీశన్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కార్తికేయన్ భార్య ఎం.టి. సులేఖ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. “ముఖ్యమంత్రి ఇలా ఏడవకూడదు.. ధైర్యంగా ఉండాలి” అంటూ ఆమె అనునయించడం అక్కడున్న వారందరినీ కదిలించింది. కార్తికేయన్ తనకు గురువు మాత్రమే కాదని, ఒక తండ్రిలా మార్గదర్శనం చేశారని సతీశన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనను రాజకీయంగా ప్రోత్సహించి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంలో కార్తికేయన్ కృషి మరువలేనిదని ఆయన భావోద్వేగంతో చెప్పారు.

మే 18న పట్టాభిషేకం

దశాబ్ద కాలం పాటు ఎల్డీఎఫ్ (LDF) పాలనలో ఉన్న కేరళలో, ఈసారి వీడీ సతీశన్ నాయకత్వంలో కాంగ్రెస్ కూటమి 102 స్థానాలతో సంచలన విజయం సాధించింది. గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీసిన సతీశన్, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. మే 18న తిరువనంతపురంలోని లోక్ భవన్‌లో ఆయన కేరళ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి దక్కిన వేళ గతాన్ని, తనకు అండగా నిలిచిన వ్యక్తులను మర్చిపోకుండా ఆయన ప్రవర్తించిన తీరు రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha