Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

వార్త 20 hrs ago

Kesineni Nani: విజయవాడ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న 'కేశినేని సోదరుల' అంతర్గత పోరు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సామాజిక మాధ్యమాల వేదికగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ, అవాస్తవాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని..

తన సొంత అన్న, మాజీ ఎంపీ (వైసీపీ నేత) కేశినేని నానిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎంపీ చిన్ని ఇచ్చిన ఈ కంప్లైంట్ ఆధారంగా పటమట పోలీసులు కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఐటీ యాక్ట్ (IT Act) కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Read also: Chinthala Venkataramana Swamy Temple: ఘనంగా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం!

అసలు వివాదం ఏంటి?

కేశినేని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత ఏడాది (2025 ఏప్రిల్ 22న) కేశినేని నాని సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. ఆ లేఖలో 'ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీ ముసుగులో ఎంపీ చిన్ని అక్రమ ఆర్థిక లబ్ధి పొందుతున్నారని, బినామీల అండతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని నాని సంచలన ఆరోపణలు గుప్పించారు. అయితే, ఈ తప్పుడు ప్రచారంపై తాను గతంలోనే లీగల్ నోటీసులు జారీ చేసినప్పటికీ, నాని నుండి ఎలాంటి స్పందన రాలేదని.. పైగా నిరంతరం తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని చిన్ని తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.

Kesineni Nani: కేశినేని నానిపై నమోదైన సెక్షన్లు ఇవే:

చిన్ని ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పటమట పోలీసులు కేశినేని నానిపై కఠిన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు: 204, 351, 352, 353, 356, 61,ఐటీ యాక్ట్ (IT Act) సెక్షన్లు: 66, 66(C), 66(D), 67, 72 కింద కేసు నమోదు చేశారు.

ఎన్నికల ఓటమితో ముదిరిన వైరం

కేశినేని అన్నదమ్ముల మధ్య ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, బినామీల వ్యవహారాలపై గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ లొల్లి పూర్తిగా బహిర్గతమైంది. గత ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ (TDP) తరపున బరిలోకి దిగగా, అన్న కేశినేని నాని వైసీపీ (YSRCP) తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తమ్ముడు చిన్ని చేతిలో అన్న నాని ఘోర పరాజయం పాలైన తర్వాత వీరి మధ్య రాజకీయ, కుటుంబ సంబంధాలు మరింత క్షీణించాయి.

ప్రస్తుతం పటమట పోలీసులు ఈ వివాదానికి సంబంధించిన కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టులు, లేఖల డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. విజయవాడ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈ అన్నదమ్ముల సవాల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఏడు రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha