Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

వార్త 3 weeks ago

KCR: తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు (కేసీఆర్) అధ్యక్షతన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష (ఎల్పీ) సంయుక్త సమావేశం అత్యంత కీలకంగా జరుగనుంది.

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహ రచన

శాసనసభ, శాసనమండలి వేదికగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనే దానిపై పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న జాప్యం వంటి అంశాలపై సభలో ఏ రీతిలో గళం విప్పాలనే దానిపై నేతలకు స్పష్టమైన ప్రణాళికను కేసీఆర్ వివరించనున్నట్లు తెలుస్తోంది.

KCR: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఉద్ధృత నిరసనలు

మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆందోళనలు నిర్వహిస్తున్న గులాబీ బాట, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు.

కొండా సురేఖ బర్తరఫ్.. భావోద్వేగానికి గురైన సుస్మిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha