Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే - సీఎం రేవంత్

కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే - సీఎం రేవంత్

వార్త 2 weeks ago

NTR Statue Unveiling : హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రీవనం చౌరస్తాలో నందమూరి తారక రామారావు (NTR) భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.

రేవంత్ రెడ్డి రాజకీయంగా అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన జీవితంలోనే అత్యంత మధురమైన, మరువలేని సంఘటన అని ఆయన అభివర్ణించారు. ఈ విగ్రహ ఏర్పాటుపై ప్రతిపక్షాల నుండి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎదురొడ్డి నిలిచామే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తెలుగు నేలపై ఎంతో మంది సామాన్యులను అగ్ర నాయకులుగా తీర్చిదిద్దారని గుర్తుచేస్తూ.. చివరికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా రాజకీయ భిక్ష పెట్టింది స్వయానా అన్నగారేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నగారి నీడన బతికి, రాజకీయంగా ఎదిగిన వారే.. ఈ రోజు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే తప్పుగా మాట్లాడటం వారి అజ్ఞానానికి, సంస్కార హీనతకు నిదర్శనమంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఘాటు విమర్శలు గుప్పించారు.

Read Also : రోడ్డు నిండా గుంతలు, విరిగిన మ్యాన్‌హోల్.. తల్లగడ్డ రోడ్ల పరిస్థితి ఇంత దారుణమా?

ఇందిరమ్మ ఆశీస్సులు, ఎన్టీఆర్ స్ఫూర్తి.. కాంగ్రెస్ ‘ప్రజాపాలన’కు అవే పునాది!

దేశ చరిత్రలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, నందమూరి తారక రామారావు, ఇందిరా గాంధీలు ఈ జాతి గర్వించదగ్గ నిజమైన ‘జాతి రత్నాలు’. వారి ఆశయాల కలయికతోనే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతోంది. నాటి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలే నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ప్రధాన పునాది అని ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఆనాడు ఎన్టీఆర్ తెచ్చిన పక్కా ఇళ్ల పథకమే నేటి ‘ఇందిరమ్మ ఇండ్లు’గా, ఆయన నాటి రూ.2 కిలో బియ్యం ఆలోచనే నేటి ‘సన్నబియ్యం’ పంపిణీగా రూపాంతరం చెందాయని వివరించారు. అలాగే నాటి పాత పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది కూడా ఎన్టీఆరేనని కొనియాడారు. ఇందిరమ్మ ఆశీస్సులు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము ముందుకు సాగుతున్నామని, రాబోయే పదేళ్ల కాలం (2024 నుండి 2034 వరకు) తెలంగాణలో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

టీడీపీ ప్లెక్సీ లో రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha