Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ యెన్నం శ్రీనివాస్ రెడ్డి!

కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ యెన్నం శ్రీనివాస్ రెడ్డి!

వార్త 2 weeks ago

Yennam Srinivas Reddy: వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పక్షం (సీఎల్పీ) తీవ్రంగా స్పందించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వెంకటరమణారావు కేటీఆర్ వైఖరిని ఎండగట్టారు. కేటీఆర్ చదువుకున్న నాయకుడు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని ప్రజలు భావించేవారని, కానీ అధికారం కోసం ఆయన ఎంతకైనా దిగజారే స్థాయికి వెళ్లారనే భావన ప్రజల్లో కలుగుతోందని విమర్శించారు. సీఎం కుర్చీ ఎలా దక్కించుకోవాలో చెప్పిన కేసీఆర్, ప్రజల విశ్వాసం ఎలా నిలబెట్టుకోవాలో మాత్రం తన కొడుకుకు చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతుల సభ పెట్టి రైతుల సమస్యలపై మాట్లాడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని వారు స్పష్టం చేశారు.

Read Also : కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింప

కాంగ్రెస్ హయాంలోనే రైతు సంక్షేమం

రైతు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రైతు అని, దేశంలో రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అనే గొప్ప ఆలోచనను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలైనా నిలకడగా కొనసాగుతుంటే, కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు "కులేశ్వరం"గా మారి కృంగిపోయిందని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌పై అవాకులు, చవాకులు మాట్లాడటం కేటీఆర్‌కు అలవాటైందని, వారి వ్యవహారం "బొమ్మరిల్లు" సినిమాలో కుటుంబ పంచాయతీ సన్నివేశంలా నడుస్తోందని మండిపడ్డారు.

Yennam Srinivas Reddy: రేవంత్ రెడ్డి ఎదుగుదలపై విషప్రచారం

గతంలో రేవంత్ రెడ్డికి జెడ్పీటీసీ సీటు ఇవ్వడానికి కూడా బీఆర్‌ఎస్ నిరాకరించిందని, కానీ ఆయన స్వయంకృషితో జెడ్పీటీసీగా గెలిచి ఎదిగిన నాయకుడని కొనియాడారు. కొడంగల్‌లో ఓడినా, మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో గెలిచి తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. కేటీఆర్ తీరు చూస్తుంటే ఆయన "రూరల్‌వా లేక జోకర్‌వా" అన్నది ప్రజలకు అర్థం కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమిళనాడు నాయకుడు విజయ్‌ను చూసైనా రాజకీయ సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. ఇదే తీరు కొనసాగితే సిరిసిల్లలో కూడా కేటీఆర్ గెలవలేరని, ప్రజలను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడితే రాజకీయంగా ప్రజలే సమాధి చేస్తారని హెచ్చరించారు.

స్క్రోలింగ్ పాయింట్స్ (Scrolling Points):

  • కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
  • చదువుకున్న కేటీఆర్ అధికారం కోసం దిగజారి మాట్లాడుతున్నారు.
  • కుర్చీని ఎలా దక్కించుకోవాలో చెప్పిన కేసీఆర్.. నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చెప్పలేదు.
  • రైతు సభలో సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు.
  • దేశంలో రైతు రుణమాఫీని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్.
  • కాళేశ్వరం ప్రాజెక్టు “కులేశ్వరం”గా మారి కృంగిపోయింది.
  • కేటీఆర్-కేసీఆర్ వ్యవహారం “బొమ్మరిల్లు” సినిమా పంచాయతీలా ఉంది.
  • జెడ్పీటీసీ స్థాయి నుంచి స్వయంకృషితో ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి.
  • తమిళనాడు నేత విజయ్‌ను చూసి రాజకీయ సంస్కారం నేర్చుకో కేటీఆర్.
  • అహంకారంతో మాట్లాడితే సిరిసిల్లలో కూడా గెలవలేవు.. జాగ్రత్త!

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మెదక్ కలెక్టర్ తీరుపై 'ప్రజా'గ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha