Mango Benefits: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్లను ఆరగించడానికి చిన్నల నుండి పెద్దల వరకు అందరూ అమితమైన ఆసక్తి చూపిస్తారు. పండ్లలో రారాజుగా పిలవబడే ఈ మధుర ఫలాన్ని చాలామంది సమయంతో సంబంధం లేకుండా తింటుంటారు.
ముఖ్యంగా కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినేస్తుంటారు. అయితే, పరగడుపున మామిడి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? దీనివల్ల ఎలాంటి లాభనష్టాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Acidity Due To Mangoes
మామిడి పండ్లలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి పండు పోషకాల గని అని చెప్పవచ్చు. ఇందులో లభించే అధిక ఫైబర్ (పీచు పదార్థం) జీర్ణక్రియను చురుగ్గా ఉంచి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే పచ్చి మామిడి ముక్కలను తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపులో మంట, విరేచనాల వంటి ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.
Read also:Jaggery Benefits: బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!
మామిడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ‘సి’ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరిస్తే.. విటమిన్ ‘ఎ’, ‘ఇ’ లు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా మార్చడంలో అద్భుతంగా సహాయపడతాయి.
Mango Benefits: ఖాళీ కడుపుతో తింటే ?
ఇన్ని అద్భుతమైన పోషకాలు ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఖాళీ కడుపుతో మామిడి పండ్లను అస్సలు తినకూడదని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లకు సహజంగానే శరీరంలో వేడిని (ఉష్ణోగ్రతను) పెంచే స్వభావం ఉంటుంది. పరగడుపున వీటిని నేరుగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది.
దీని ఫలితంగా తీవ్రమైన ఎసిడిటీ, కడుపులో మంట, గ్యాస్ వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, శరీరంలో వేడి ఎక్కువైతే ముఖంపై మొటిమలు, చర్మంపై అలర్జీలు లేదా దద్దుర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. రాత్రి పడుకునే ముందు తినడం వల్ల కూడా ఇదే విధమైన బాడీ హీట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మామిడి పండ్లు తినడానికి సరైన సమయం మరియు పద్ధతి ఏది?
ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం.. మామిడి పండ్లను తినడానికి మధ్యాహ్న సమయం అత్యంత అనుకూలమైనది. అలాగే, మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను నేరుగా అలాగే తినేయకూడదు. వాటిని తినడానికి కనీసం ఒక గంట లేదా అరగంట ముందు చల్లటి నీటిలో వేసి నానబెట్టాలి.
ఇలా చేయడం వల్ల మామిడి పండ్లలోని సహజ వేడి తత్వం (Phytic acid ప్రభావం) తగ్గిపోతుంది. తద్వారా చర్మ సమస్యలు, కడుపులో మంట రాకుండా ఉంటాయి. కాబట్టి, రుచికరమైన మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే, వాటిని ఖాళీ కడుపుతో కాకుండా సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఎంజాయ్ చేయడం ఎంతో ముఖ్యం.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

