Dailyhunt

Khammam crime: యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి

వార్త 3 months ago
Khammam crime: యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి

ఖమ్మం(Khammam crime) జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్(Two Town police station) పరిధిలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది.

భార్య, చిన్నారి తో కలిసి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రెహమాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి అమానుషంగా దాడి చేసి ప్రాణాలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

బైక్‌పై వచ్చిన దుండగుడు

ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన దుండగుడు రెహమాన్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా తన్నుతూ తీవ్రంగా కొట్టాడు. దాడి తీవ్రతతో రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందగా, మృతి చెందిన అనంతరం కూడా నిందితుడు దాడిని ఆపకపోవడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ క్రూర ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Kurnool: చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తితో దాడి చేసిన యువకుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha