Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే 'ఆటోమెటిక్' అణుదాడి!

కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే 'ఆటోమెటిక్' అణుదాడి!

వార్త 2 weeks ago

North Korea Nuclear Policy: ఉత్తర కొరియా తన అణు విధానంలో అత్యంత కీలకమైన, భయంకరమైన మార్పును ప్రవేశపెట్టింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఈ మేరకు రాజ్యాంగ సవరణను ఆమోదించినట్లు 'ది టెలిగ్రాఫ్' నివేదిక వెల్లడించింది.

దీని ప్రకారం, దేశ అత్యున్నత నాయకత్వంపై ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా ప్రత్యర్థి దేశాలపై తక్షణమే అణు బాంబులతో విరుచుకుపడేలా నిబంధనలను మార్చారు.

Read Also: Happy Mothers Day 2026: అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే అద్భుతమైన మాటలు!

ఆర్టికల్ 3: ఆటోమెటిక్ అణు దాడి నిబంధన

కొత్తగా సవరించిన చట్టంలోని ఆర్టికల్ 3 ప్రకారం, ఒకవేళ విదేశీ దాడుల వల్ల కిమ్ జోంగ్ ఉన్, హత్యకు గురైనా, ఆ దేశ అణ్వాయుధ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ప్రమాదంలో పడితే.. ఎవరి ఆదేశాలు లేకుండానే ‘ఆటోమెటిక్‌గా, తక్షణమే’ అణుదాడి ప్రారంభమవుతుంది. అంటే శత్రువులు కిమ్‌ను లక్ష్యంగా చేసుకుంటే, మరుక్షణమే ఆ దేశ అణు క్షిపణులు శత్రువుల మీదకు దూసుకెళ్తాయి.

 Kim Jong Un

North Korea Nuclear Policy: తిరుగులేని ఆధిపత్యం

ఈ కొత్త చట్టం దేశ అణ్వాయుధాలపై కిమ్ జోంగ్ ఉన్ కు ఉన్న ఏకఛత్రాధిపత్యాన్ని మరింత బలపరుస్తుంది. గతంలో అణుదాడికి కిమ్ స్వయంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ప్రాణానికే ముప్పు వస్తే వ్యవస్థే స్పందించేలా నిబంధనలు రూపొందించారు. కేవలం అణ్వాయుధాలు కలిగి ఉండటమే కాకుండా, వాటి వినియోగంపై వెనక్కి తగ్గేది లేదని ఉత్తర కొరియా అంతర్జాతీయ సమాజానికి ఈ నిర్ణయం ద్వారా హెచ్చరికలు పంపింది.

ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే క్షిపణి పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికాను సవాల్ చేస్తున్న కిమ్, ఇప్పుడు ‘డెడ్ హ్యాండ్’ (Dead Hand) లాంటి ఆటోమెటిక్ డిఫెన్స్ సిస్టమ్‌ను ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha