Bangalore University Controversy: బెంగళూరులోని ఒక ప్రఖ్యాత ప్రైవేట్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన మత వివక్ష ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్, ముస్లిం విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని ‘ఉగ్రవాది’ అని సంబోధించడం తీవ్ర దుమారం రేపింది. ఆ ప్రొఫెసర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది.
బనశంకరి రింగ్ రోడ్ క్యాంపస్‌లో మార్చి 24న జరిగిన ఈ ఘటనలో ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే వివాదాస్పదంగా వ్యవహరించారు. అఫాన్ అనే విద్యార్థిని దాదాపు 60 మంది తోటి విద్యార్థుల ముందే సుమారు 13 సార్లు ‘ఉగ్రవాది’ అని పిలిచినట్లు ఆరోపణలు వచ్చాయి. “నీలాంటి వాళ్ల వల్లే ఇరాన్ యుద్ధం వచ్చింది”, “మీరంతా మూర్ఖులు, నరకానికి పోతారు” వంటి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి క్లాస్‌లో భయాందోళనలు సృష్టించినట్లు బాధితుడు ఇతర విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Read Also : Rupee vs dollar : డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం

Professor calls student terrorist in Bangalore
Bangalore University Controversy: విద్యార్థులపై ఒత్తిడి
ఈ వివాదం ముదిరిన తర్వాత కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను కావాలనే డిలీట్ చేశారని సమాచారం. అంతేకాకుండా, బాధితుడికి మద్దతుగా నిలిచిన ఇతర విద్యార్థులను కూడా వివిధ కారణాలతో సస్పెండ్ చేయడం గమనార్హం. ప్రొఫెసర్ తన తప్పును అంగీకరిస్తూ రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పినప్పటికీ, బాధిత విద్యార్థికి నేరుగా సారీ చెప్పకపోవడం, డిపార్ట్‌మెంట్ హెడ్ ద్వారా విద్యార్థిపై రాజీ పడాలని ఒత్తిడి తీసుకురావడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఉదంతాన్ని “మత విద్వేష ప్రసంగం”గా పరిగణించాలని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం విద్యార్థుల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ అంతర్గత విచారణ జరుపుతున్నామని ప్రకటించినప్పటికీ, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

