Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు చేయకూడని ప్రధాన తప్పులు

కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు చేయకూడని ప్రధాన తప్పులు

వార్త 1 week ago

Coconut water : కొబ్బరి నీళ్లు ప్రకృతి ప్రసాదించిన అమృతం వంటివి. ముఖ్యంగా వేసవిలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే, వీటిని తాగేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల పూర్తి ప్రయోజనాలు అందకపోగా, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎండ వేడికి అల్లాడిపోయే శరీరానికి కొబ్బరి నీళ్లు ఒక సహజమైన ఎనర్జీ డ్రింక్. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లతో నిండి ఉండే ఈ పానీయం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఆరోగ్యానికి మంచిదే కదా అని కొబ్బరి నీళ్లను ఎలా పడితే అలా తాగితే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also : Bloating : వేసవిలో కడుపు ఉబ్బరం: నివారణ మార్గాలు

 coconut water

coconut water : కొబ్బరి నీరు ఒక వరం లాంటిదే

ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు విరివిగా దొరుకుతున్నాయి. చాలా మంది వీటిని తాజాగా భావించి కొనుగోలు చేస్తారు. కానీ వీటిలో రుచి కోసం చక్కెర, నిల్వ ఉండటం కోసం ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు. ఇవి కొబ్బరి నీటిలో ఉండే సహజమైన పోషకాలను నాశనజేయడమే కాకుండా శరీరానికి హాని కలిగిస్తాయి. వీలైనంత వరకు ప్రకృతి సిద్ధంగా లభించే తాజా కొబ్బరి బొండాలనే ఎంచుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో లేదా ఒకేసారి భారీ పరిమాణంలో తాగడం వల్ల కడుపు ఉబ్బరం కలుగుతుంది. అంతేకాదు శరీరంలో పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. చాలా మంది భోజనం చేసిన వెంటనే దాహం తీర్చుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగుతారు. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కొబ్బరి నీటిలోని ఎలక్ట్రోలైట్లు జీర్ణరసాలను పలుచగా చేస్తాయి. తద్వారా కడుపు భారంగా అనిపించవచ్చు. భోజనం చేసిన కనీసం 30 నుండి 40 నిమిషాల తర్వాత తాగడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. కొబ్బరి నీరు ఒక వరం లాంటిదే అయినా అందరికీ ఇది ఒకేలా పనిచేయదు. మూత్రపిండాల పనితీరు మందగించిన వారు పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీళ్లను తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇది రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

 coconut water

చల్లదనంతో తాగడమే అత్యుత్తమం

ఐస్ ముక్కలతో చల్లని ముప్పు: కొబ్బరి నీటిని ఫ్రిజ్‌లో పెట్టి లేదా ఐస్ ముక్కలు వేసి మరీ చల్లగా తాగడం ఈ కాలంలో చాలా మందికి అలవాటు. అయితే, ప్రకృతి సిద్ధంగా చల్లగా ఉండే ఈ పానీయాన్ని మరింత చల్లబరిస్తే గొంతు నొప్పి, జలుబు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద లేదా సహజమైన చల్లదనంతో తాగడమే అత్యుత్తమం. కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన పద్ధతి ఏమిటి?: కొబ్బరి బొండాన్ని కొట్టిన 5-10 నిమిషాల్లోనే తాగేయాలి. గాలి తగిలితే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా, చిన్న చిన్న సిప్పులతో నెమ్మదిగా తాగాలి. దీనివల్ల శరీరం పోషకాలను మెరుగ్గా గ్రహిస్తుంది. ఉదయం పూట లేదా వ్యాయామం చేసిన తర్వాత తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha