Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొబ్బరి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కొబ్బరి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

వార్త 1 month ago

AP Coconut Farmers:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి సాగు చేస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందినది. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

గత ప్రభుత్వ కాలంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నది.

Read also: Free German Training: ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!

 Good news from the government for coconut farmers.

కాలువల పూడిక తీత సమస్యతో నష్టం

గత పాలనలో సాగునీటి కాలువలు సరిగా శుభ్రం చేయకపోవడం తీవ్ర నష్టానికి కారణమైంది. పూడిక తీయని కారణంగా సముద్రపు ఉప్పు నీరు తోటలలోకి చొచ్చుకుపోయింది. దీనివల్ల పదివేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న కొబ్బరి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉప్పు నీరు చేరడం వలన వేలాది చెట్లు ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రి అధికారికంగా వెల్లడించారు.

AP Coconut Farmers:చెడిపోయిన ప్రతి మొక్కకు రూ. వెయ్యి అందజేత

ఉప్పు నీటి తాకిడికి పాడైపోయిన ప్రతి కొబ్బరి మొక్కకు ప్రభుత్వ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతీ చెట్టుకు వెయ్యి రూపాయల చొప్పున నేరుగా సాయం జమ చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా కొబ్బరి రైతులు మళ్లీ సాగుపై దృష్టి పెట్టడానికి అవసరమైన భరోసా లభిస్తుంది. ప్రభుత్వ ఈ సహాయం తోటల పునరుద్ధరణకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

ఏపీలో రూ.42కే డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha