Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొడాలి నాని రాజకీయ వారసుడు ఇతడే!

కొడాలి నాని రాజకీయ వారసుడు ఇతడే!

వార్త 1 week ago

Kodali Nani Political Successor: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసత్వంపై స్పష్టత వచ్చేసింది.

ఆయన రాజకీయ వారసుడు ఎవరనే విషయాన్ని తోటి మాజీ మంత్రి పేర్ని నాని అధికారికంగా ప్రకటించారు.

Read also: Alipiri Street Vendors: వీధి వ్యాపారుల నిరసన ర్యాలీలో భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్!

 This is the political heir of Kodali Nani!

Kodali Nani Political Successor: వేదికపై నుంచి పేర్ని నాని కీలక ప్రకటన

గుడివాడ లింగవరంలోని కే కన్వెన్షన్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌ – SER) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ నేతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ వేదికపై నుంచే పేర్ని నాని మాట్లాడుతూ.. కొడాలి నాని రాజకీయ వారసుడు కొడాలి అర్జునరావు అని ప్రకటించారు. అర్జున్ 2034 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. కొడాలి అర్జున్ మరెవరో కాదు.. కొడాలి నాని సోదరుడి కుమారుడు. గత కొంతకాలంగా ఆయన గుడివాడ వైఎస్సార్‌సీపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ?

కొడాలి అర్జున్ 2034 ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో, వచ్చే 2029 ఎన్నికల బరిలో కొడాలి నాని స్వయంగా ఉంటారనే క్లారిటీ వచ్చింది. నిజానికి కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ, వారికి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడంతో తన సోదరుడి కుమారుడిని వారసుడిగా ఎంపిక చేశారు.

గతంలో 2024 ఎన్నికల సమయంలో కొడాలి నాని మాట్లాడుతూ.. 2029 నాటికి తనకు 58 ఏళ్లు వస్తాయని, ఆ వయసులో తాను పోటీ చేయలేకపోవచ్చని, తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని హింట్ ఇచ్చారు. అయితే తాజా సమీకరణాల ప్రకారం.. 2029లో నాని పోటీ చేశాకే, 2034లో అర్జున్ ఎంట్రీ ఉంటుందని స్పష్టమవుతోంది.

‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కొడాలి నాని

మరోవైపు ఈ సదస్సులో ఓట్ల తొలగింపు ప్రక్రియ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీలు ఈ ‘సర్’ ప్రక్రియ వల్లే ఓడిపోయారని (వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించడం వల్ల) నాని పేర్కొన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల జాబితా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా పేర్ని నాని మాట్లాడుతూ.. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్లు ఇవ్వడం లేదనే చర్చ నడుస్తోందని వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha