Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొడుకును హత్య చేసిన తల్లి అరెస్ట్.. ఘటనకు కారణం ఏంటి?

కొడుకును హత్య చేసిన తల్లి అరెస్ట్.. ఘటనకు కారణం ఏంటి?

వార్త 3 weeks ago

Anantapur Crime: అనంతపురం నగరంలో గుండెలవిసే విషాద ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో రోజూ డబ్బుల కోసం వేధిస్తూ నరకం చూపిస్తున్న కన్నకొడుకును ఓ తల్లి ప్రాణాలతో తీసేసింది.

ఆవేశంలో సహనం కోల్పోయి చేసిన ఈ దాడిలో కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

డబ్బుల కోసం రోజూ నరకం

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం పట్టణ పరిధిలో నివసిస్తున్న సునీత అనే మహిళకు సురేంద్ర (28) అనే కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా సురేంద్ర మద్యానికి తీవ్రంగా బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ రోజూ తాగి వచ్చి, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య తరచూ తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతుండేవి.

Anantapur Crime: మద్యం మత్తులో ఘర్షణ.. గొంతులో కత్తెరతో పొడిచి హత్య!

హత్య జరిగిన రోజు కూడా సురేంద్ర మద్యం మత్తులో నిట్టనిలువునా ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కొడుకు పెడుతున్న టార్చర్ భరించలేకపోయిన సునీత ఆవేశంతో ఊగిపోయింది. ఇంట్లోనే ఉన్న పదునైన కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావమై సురేంద్ర అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

పోలీసుల రంగప్రవేశం.. తల్లి అరెస్ట్

ఈ దారుణంపై సమాచారం అందుకున్న అనంతపురం త్రీటౌన్ (మూడో పట్టణ) పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ మేరకు నిందితురాలైన తల్లి సునీతను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆమెపై హత్య కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Epaper: epaper.vaartha.com

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే ఉచిత ఆధార్ క్యాంపులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha