Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

వార్త 4 months ago

రైల్వే కోడూరు ఎమ్మెల్యే(Koduru MLA) ఆరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహారంలో బాధితురాలు హర్ష వీణ మరో వీడియో విడుదల చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కేసు విషయంలో తరంశెట్టి నాగేంద్ర వంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్‌కు తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.

తాను పంచాయతీ రాజ్ శాఖకు చెందిన మహిళనని, అదే శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలిసి అన్ని ఆధారాలను సమర్పించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పదవి లేకపోతే శ్రీధర్(Koduru MLA) ఇప్పటికే జైలులో ఉండేవారని పేర్కొంటూ, తన ఆరోపణలు తప్పని తేలితే తనను చంపేయాలని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పార్టీ అధినేతకు నిజాలు వివరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నాగేంద్ర వంటి వ్యక్తులకు భయపడేది లేదని, తన పోరాటం కొనసాగుతుందని వీడియోలో స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha