Ajinkya Rahane: రాయ్‌పూర్‌లో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘనవిజయం సాధించగా, కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. అంగ్ర్కిష్ రఘువంశీ (71; 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా రింకూ సింగ్ (49 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) వేగంగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
Read Also: IPL 2026 : రికార్డులు సృష్టించాలన్నా..తిరగరాయాలన్నా కోహ్లీనే !!
Ajinkya Rahane: ఓటమికి కారణం అదే!
ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం విరాట్ కోహ్లీ (105 నాటౌట్; 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో 193 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Ajinkya Rahane comments on RCB win
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజంటేషన్ సెషన్‌లో రహానే తమ జట్టు వైఫల్యాలను విశ్లేషించారు.తమ ఓటమికి బ్యాటింగ్ కంటే ఫీల్డింగ్ వైఫల్యాలే ప్రధాన కారణమని రహానే కుండబద్దలు కొట్టారు.ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్యాచ్‌ను కీలక సమయంలో వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించిందని రహానే అభిప్రాయపడ్డారు.”కోహ్లీ వంటి ఆటగాడికి లైఫ్ ఇస్తే అతను మ్యాచ్‌ను లాగేసుకుంటాడు.
కొత్తగా వచ్చే బ్యాటర్‌కు ఈ పిచ్‌పై కుదురుకోవడం కష్టం, ఆ సమయంలో విరాట్‌ను ఔట్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది” అని విశ్లేషించారు.గత కొన్ని మ్యాచ్‌లలో ఫీల్డింగ్‌లో అదరగొట్టిన తమ జట్టు, ఈ కీలక పోరులో క్యాచ్‌లు చేజార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

