Dailyhunt
కోహ్లీ, పటిదార్, సాల్ట్ హాఫ్ సెంచరీల సునామీ!

కోహ్లీ, పటిదార్, సాల్ట్ హాఫ్ సెంచరీల సునామీ!

వార్త 1 week ago

MI vs RCB Live Score: ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్నMI vs RCBమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకోగా, ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం.

ముగ్గురు బ్యాటర్ల హాఫ్ సెంచరీలు

ఆర్‌సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో నిలకడగా ఆడి 50 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

MI vs RCB Live Score: పటిదార్ విధ్వంసం.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు

మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ రజత్ పటిదార్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 53 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. చివర్లో టిమ్ డేవిడ్ కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో వరుస ఫోర్లు, సిక్సర్లతో ఆర్‌సీబీ స్కోరును 240కి చేర్చాడు.

ముంబై బౌలింగ్ వైఫల్యం

ముంబై బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (0/35) వికెట్ తీయలేకపోగా, ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రస్తుతం ముంబై గెలవాలంటే 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి. ఈ భారీ ఛేదనలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ముంబై టార్గెట్ 241

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha