LizLaz: మైదానంలో తన బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించే విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో చిన్న పని చేసినా అది పెద్ద వార్త అయిపోతుంది. తాజాగా జర్మనీకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ (LizLaz) పోస్ట్‌కు కోహ్లీ లైక్ కొట్టడం పెద్ద చర్చకు దారితీసింది.
దీనిపై లిజ్‌లాజ్ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.
Read Also:IPL 2026 : నేడు IPL అభిమానులకు డబుల్ కిక్..బరిలోకి నాల్గు కీలక జట్లు
LizLaz
LizLaz: నిద్రలేచేసరికి వార్తల్లో ఉన్నాను!
కోహ్లీ తన పోస్ట్‌ను లైక్ చేసిన విషయం తనకు తెలియదని, వార్తల ద్వారానే తెలిసిందని లిజ్‌లాజ్ చెప్పారు. “నేను ఉదయం నిద్రలేచేసరికి నా గురించి వార్తలు వస్తున్నాయి. చాలా మంది నాకు ఆర్టికల్స్, స్క్రీన్‌షాట్లు పంపించారు. ఆయన లైక్ చేయడం నాకు సంతోషాన్నిచ్చింది కానీ, ఇది ఇంత పెద్ద దుమారానికి దారితీయడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి విరాట్ కోహ్లీని చూస్తే నాకు జాలి వేస్తోంది. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ చిన్న విషయాన్ని కూడా ఇంతలా భూతద్దంలో చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించింది” అని ఆమె పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

