Lizloz comments on Virat Kohli: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ స్టార్ క్రికెటర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు జర్నలిస్టులు నీచమైన ప్రయత్నాలకు ఒడిగట్టారని జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కోహ్లీపై నెగటివ్ ప్రచారం చేస్తే భారీగా డబ్బు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని ఆమె బహిరంగంగా వెల్లడించారు.
Read Also:Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు.. సిక్సర్లే కాదు పుల్కాలు కూడా!
Lizloz
Lizloz comments on Virat Kohli: ఒక్క ‘లైక్’తో పెరిగిన పాపులారిటీ
అయితే, ఇప్పుడు ఈ విషయం పైఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదంపై స్పందిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు.కోహ్లీ ఆసియా ఖండానికి లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి వారు. అలాంటి గొప్ప క్రీడాకారుడిపై బురద చల్లడం సరైంది కాదని పేర్కొన్నారు. కేవలం ఒక సోషల్ మీడియా ‘లైక్’ను పెద్ద వివాదంగా మలచడం అనవసరమని, కోహ్లీ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో తాను కూడా అనవసరంగా లాగబడ్డానని తెలిపారు.’కొంతమంది జర్నలిస్టులు కోహ్లీ గురించి చెడుగా మాట్లాడాలని, అతనికి వ్యతిరేక వ్యాఖ్యలు చేయాలని కోరారు. అందుకు నాకు డబ్బు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ నేను వాటికి ఒప్పుకోలేదు. ఇలాంటిది జరుగుతుందని అస్సలు ఊహించలేదు. డబ్బు కోసం కోహ్లీ గురించి చెడుగా ఎందుకు మాట్లాడాలి? నేను అలాంటి మనిషిని కాదు.'అని లిజ్ లాజ్ స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

