Sabyasachi Datta:పశ్చిమ బెంగాల్ లో సంచలనం రేపిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తపై దాడి జరిగింది. బిదాన్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయనపై కోడిగుడ్లు, ఆవుపేడ, టమోటాలతో కొందరు దాడి చేశారు.
బెదిరింపులు, డబ్బు వసూళ్ల ఆరోపణలతో అరెస్టయిన దత్తను కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. పోలీసులు రక్షణ కల్పిస్తున్నప్పటికీ నిరసనకారులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లి దాడికి పాల్పడటం గమనార్హం.
నిరసనకారుల ఆగ్రహం
కోర్టుకు తీసుకెళ్తున్న వాహనం దిగగానే నిరసనకారులు దత్తపై కోడిగుడ్లు, పేడ విసిరారు. కోర్టు ప్రాంగణం వద్ద మరో గుంపు దొంగ దొంగ అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. ఒక వ్యాపారి నుంచి కోటి రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నించారనే ఆరోపణలపై సబ్యసాచి దత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, నిరసనకారులు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకొని తమ నిరసనను ఇలా వ్యక్తం చేశారు.
Sabyasachi Datta:రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు
బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కూడా అయిన దత్తపై జరిగిన ఈ దాడి బెంగాల్ రాజకీయాల్లో చర్చగా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా నిరసనకారులు దాడి చేయడం పోలీసుల వైఫల్యమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఈ రోజుతో ప్రధానిగా మోదీకి 4399 రోజులు పూర్తీ

