Clelia Verdier coma : ఫ్రాన్స్‌కు చెందిన 19 ఏళ్ల క్లెలియా వెర్డియర్ అనుభవం ప్రస్తుతం వైద్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మూడు వారాల పాటు కోమాలో ఉన్న ఈ యువతి, స్పృహలోకి రాగానే తన ముగ్గురు కూతుళ్ల గురించి ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అసలు పెళ్లి కానీ, పిల్లలు కానీ లేని ఈ యువతి, కోమాలో ఉన్న సమయంలో ఏడేళ్ల పాటు తల్లిగా జీవించినట్లు మెదడు సృష్టించిన భ్రాంతి ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కోమాలో ఏడేళ్ల మాతృత్వం
2025 జూన్‌లో ఆత్మహత్యాయత్నం చేసి కోమాలోకి వెళ్లిన క్లెలియా, మూడు వారాల తర్వాత మేల్కొంది. అయితే ఆమెకు తన గతం కంటే కూడా కోమాలో కన్న కలలే వాస్తవంగా అనిపించాయి. తనకు మిలా, మైల్స్, మైలీ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, వారితో కలిసి పార్కులకు వెళ్లడం, భోజనం చేయడం వంటి జ్ఞాపకాలు తన మెదడులో బలంగా ముద్రపడిపోయాయి. అసలు తనకు పిల్లలే లేరని వైద్యులు చెప్పడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Read Also:China Gaokao exam : 1.3 కోట్ల మంది విద్యార్థులు.. ఒక్క పేపర్ కూడా లీక్ అవ్వదు! ఎలా?
Clelia Verdier comaమెదడు సృష్టించిన వింత భ్రాంతి
న్యూరాలజిస్టుల ప్రకారం, మెదడు తీవ్రమైన ఒత్తిడికి లేదా గాయాలకు గురైనప్పుడు ఇలాంటి వాస్తవికమైన కలలు (Vivid Dreams) రావడం జరుగుతుంది. కోమాలో ఉన్నప్పుడు మెదడు పూర్తిగా నిష్క్రియం కాకుండా, కొన్నిసార్లు ఇలాంటి సంక్లిష్టమైన మరియు భావోద్వేగభరితమైన ఊహల ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఏడాది గడిచినా, ఆ పిల్లలపై తనకున్న ప్రేమ తగ్గలేదని, తాను ఎప్పటికీ వారి తల్లినేనని క్లెలియా ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
చైనాలో ట్రంప్ పర్యటన.. తైవాన్ అంశంపై 'రెడ్ లైన్' దాటొద్దని హెచ్చరిక!

