Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోనసీమలో కరెంట్ కష్టాలు.. 48 గంటలుగా విద్యుత్ సరఫరా బంద్!

కోనసీమలో కరెంట్ కష్టాలు.. 48 గంటలుగా విద్యుత్ సరఫరా బంద్!

వార్త 3 weeks ago

Ambedkar Konaseema District: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ శాఖ వైఫల్యం మరియు తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా (48 గంటలు) కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో సకాలంలో పునరుద్ధరణ జరగలేదు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర అంధకారంలో మగ్గుతూ నానా అవస్థలు పడుతున్నారు. కనీస విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో వేసవి తాపానికి జనం అల్లాడిపోతున్నారు.

తాగునీరు మరియు డిజిటల్ సేవలు బంద్ – స్తంభించిన జనజీవనం

కరెంట్ సరఫరా లేకపోవడం వల్ల వాటర్ ప్లాంట్లు, మోటార్లు పనిచేయక తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు, విద్యుత్ లేమితో సెల్ టవర్లు మూతపడి మొబైల్ సిగ్నల్స్ అందక ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ చెల్లింపులు (Online Payments) చేసుకోవడం సాధ్యపడక.. ప్రజలు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు కొనుగోలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల సేవలు నిలిచిపోవడంతో కోనసీమలో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

తుపాను ఎఫెక్ట్:అధికారులతో సమీక్షించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha