Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండా సురేఖ రాజకీయ జీవితం

కొండా సురేఖ రాజకీయ జీవితం

వార్త 2 weeks ago

Konda Surekha's Political Career : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నాయకురాలు కొండా సురేఖ.

ఆమె రాజకీయ ప్రస్థానం 1999లో శాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని నమోదు చేయడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2004 శాసనసభ ఎన్నికల్లోనూ అదే స్థానం నుండి రెండోసారి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యాన్ని చాటుకున్నారు. అనంతరం 2009లో పరకాల నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ అకస్మాత్తుగా మరణించిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, అభిప్రాయభేదాల కారణంగా 2013లో వైసిపికి కూడా స్వస్తి పలికి బయటకు వచ్చారు.

పార్టీల మార్పులు, పునరాగమనం: వరంగల్ ఈస్ట్ నుంచి గెలుపుతో మళ్లీ మంత్రి పీఠం!

2014 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ముందు కొండా సురేఖ టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏట జరిగిన ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ (తూర్పు) నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, 2018 శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధిష్టానం ఆమెకు టికెట్ నిరాకరించడంతో, తిరిగి తన సొంత గూడెమైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పరకాల స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమితో దెబ్బతినకుండా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన ఆమె, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలను స్వీకరించి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha