Konda Surekha : మంత్రి కొండా సురేఖపై వేటు పడుతుందనే ప్రచారం నడుస్తున్న వేళ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఆమెకు ఊహించని దన్ను లభించినట్లు సమాచారం.
ఇద్దరు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీలు, పీసీసీలోని ముఖ్య నేతలతో పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో ఆమె పట్ల కేంద్రీకృతమైన వివాదంలో కథ పూర్తిగా యూటర్న్ తీసుకుంది.
konda surekha rebellion cabinet rumorsసామాజిక సమీకరణాలు – సీఎం క్యాంపులో ఉత్కంఠ
కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే వెనుకబడిన తరగతుల (BC) సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని అధిష్ఠానానికి ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సురేఖకు బలమైన రాజకీయ మద్దతుతో పాటు సామాజిక సమీకరణాల రక్షణ కూడా లభించడంతో ఆమెను పక్కన పెట్టడం సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు ఈ మద్దతు సమీకరణాలు బలపడుతుండటంతో ముఖ్యమంత్రి క్యాంపులో తీవ్ర ఉత్కంఠ మరియు రాజకీయ చర్చ తారాస్థాయికి చేరాయి.

