Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండా సుస్మిత వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ ఆరా.. కాంగ్రెస్‌లో ఉత్కంఠ

కొండా సుస్మిత వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ ఆరా.. కాంగ్రెస్‌లో ఉత్కంఠ

వార్త 1 month ago

Meenakshi Natarajan: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ వివాదంపై ప్రత్యేకంగా ఆరా తీశారు.

రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి స్థాయి నివేదికను కోరినట్లు సమాచారం.

తీవ్రంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులను లక్ష్యంగా చేసుకుని సుస్మిత చేసిన తీవ్ర విమర్శలను పార్టీ వర్గాలు ఎంతో గమనిస్తున్నాయి. సుస్మిత వ్యవహారాన్ని పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలను అతిక్రమించి మాట్లాడటంపై నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Meenakshi Natarajan: అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకు హైకమాండ్ త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Epaper: epaper.vaartha.com

రేవంత్ రెడ్డిపై సుస్మిత వ్యాఖ్యలు.. మల్లు రవి ఘాటు స్పందన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha