Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండెక్కిన నిమ్మ ధరలు.. కేజీ ఎంతో తెలుసా ?

కొండెక్కిన నిమ్మ ధరలు.. కేజీ ఎంతో తెలుసా ?

వార్త 4 days ago

Lemon Price : ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతూ వినియోగదారులకు తీవ్ర షాక్ ఇస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పొదలకూరు మార్కెట్‌లో నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

గత వారం మంగళవారం 80 కేజీల బస్తా ధర రూ. 12,000 పలకగా, ప్రస్తుతం అది ఏకంగా రూ. 16,000కు పెరిగింది. కేవలం ఒకే వారంలో బస్తాపై రూ. 4,000 మేర ధర పెరగడంతో, బహిరంగ మార్కెట్‌లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 వరకు పలుకుతోంది. చిల్లర మార్కెట్‌లో ఒక్కో నిమ్మకాయ ధర సామాన్యుడికి భారంగా మారడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 Lemon Prices

ధరల ఘాటుకు ప్రధాన కారణాలు

నిమ్మ ధరలు ఈ స్థాయిలో భగ్గుమనడానికి ప్రధానంగా దిగుబడి పడిపోవడం మరియు వాతావరణ పరిస్థితులే కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం శ్రావణమాసం కావడం, పూజలు, శుభకార్యాలు మరియు వ్రతాల కారణంగా మార్కెట్‌లో నిమ్మకాయలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సరఫరా తక్కువగా ఉండి డిమాండ్ విపరీతంగా పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని, రానున్న రోజుల్లో దిగుబడి పెరిగితేనే ధరలు అదుపులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ : సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha