Dailyhunt
'కోర్ట్' తమిళ రీమేక్‌తో దేవయాని కుమార్తె ప్రియాంక గ్రాండ్ ఎంట్రీ

'కోర్ట్' తమిళ రీమేక్‌తో దేవయాని కుమార్తె ప్రియాంక గ్రాండ్ ఎంట్రీ

వార్త 1 week ago

Ranjan Tamil Movie: తెలుగులో నాని నిర్మాణంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం 'కోర్ట్'. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ వైవిధ్యభరితమైన చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో రీమేక్ అవుతోంది.

ఈ సినిమాతో సీనియర్ నటి దేవయాని కుమార్తె ప్రియాంక వెండితెరకు పరిచయం కానుండటం విశేషం.

Read Also:Allu Arjun - Atlee Film : రేపు అల్లు అర్జున్ మూవీ క్రేజీ అప్డేట్

 Devayani Daughter Priyanka

Ranjan Tamil Movie: తమిళంలో ‘రంజన్’గా రీమేక్

తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘కోర్ట్’ చిత్రాన్ని తమిళంలో ‘రంజన్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాంఛింగ్ కార్యక్రమం సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నటి దేవయాని తన కుమార్తె సినీ అరంగేట్రంపై స్పందించారు.తన కూతురికి ‍అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తన లాగే తన కూతురు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

విశ్వంభర డైరెక్టర్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha