Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోఠి డిఎంఇ కార్యాలయం ముందు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ధర్నా

కోఠి డిఎంఇ కార్యాలయం ముందు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ధర్నా

వార్త 3 months ago

కోఠి డిఎంఇ కార్యాలయం ముందు ధర్నా

Contract employees dharna: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది.

ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదు లోని కోఠి డిఎంఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

Read Also : Projects : రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా ప్రాజెక్టుల నిర్మాణం - ఉత్తమ్

United Medical and Health Employees protest in front of Kothi DME office

contract employees dharna: కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కె యాద నాయక్ డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసు పత్రులతోపాటు మెడికల్ కాలేజీల్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని ఆసుపత్రుల్లో పని చేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్, స్వీపర్ ఇతర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు.

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైద్య విద్య సంచాలకులు, కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి ఇచ్చినట్టు యూనియన్ నేతలు తెలిపారు.

వేతనాలు పెంచకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధం

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 20 రోజులలో వేతనాల పెంపు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారని, 20 రోజుల లోపు వేతనాలు పెంచకపోతే దశల వారి ఆందోళన పోరాటాలతోపాటు, అవసరమైతే నిరవధిక సమ్మెకు ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జె సుధాకర్, రమేష్, ప్రకాష్, దేవిదాస్, సుమన్, కర్ణాకర్, రాజు, కుమారస్వామి, విజయ, సదానందం, రమేష్, తిరుపతి, మైపాల్, జంపయ్య మనోహర్ పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం :కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha