Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothur Road Accident: వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!

Kothur Road Accident: వాహనం ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం!

వార్త 2 months ago

Kothur Road Accident: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన యువకులకు పెద్ద షాపూర్ వయా మదనపల్లి లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మదనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టి, వారిపై నుండి దూసుకెళ్లింది.

ఈ భీభత్సమైన ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరజ్, బిక్కి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Read Also : Uttar Pradesh: కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

మృతుల్లో సూరజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా, బిక్కి పి&జి (P&G) లోని చిన్ను ఇంజనీరింగ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. చేతికి అందొచ్చిన కుమారులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సిసిటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha